BREAKING: చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. AP అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు పాలనలో దూకుడు పెంచారు.

Update: 2024-06-18 14:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు పాలనలో దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ యంత్రాంగంలో భారీగా మార్పులు చేర్పులు చేపడుతున్నారు. కీలకమైన పదవులు, నామినేటేడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే బాబు మరో కీలక నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏజీగా పని చేసిన శ్రీరామ్ ఎన్నికల ఫలితాల అనంతరం తన పదవికి రిజైన్ చేశారు. దీంతో ఈ పదవిలో చంద్రబాబు దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమించారు. అయితే, 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా చంద్రబాబు దమ్మలపాటి శ్రీనివాస్‌కే రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా అవకాశం కల్పించారు. 2019లో టీడీపీ ఓటమి పాలు కావడంతో దమ్మాలపాటి శ్రీనివాస్ పదవి నుండి తప్పుకున్నారు. తిరిగి ఏపీలో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు మరోసారి శ్రీనివాస్‌కే ఏజీగా ఛాన్స్ ఇచ్చారు.

Similar News