తుఫాన్ హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
ఏపీలో గత రెండు మూడు రోజుల నుంచి వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో గత రెండు మూడు రోజుల నుంచి వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నెల 20 నుంచి 23 వరకు ఆగ్రేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందంట. ఇది తుఫాన్‌గా మారనుందని, దానిని సిత్రాంగ్‌గా పిలవాలని నామకరణం చేశారు. తుఫాన్ ఏర్పడితే ఒడిశా, పశ్చిమబెంగాళ్, ఏపీ, తెలంగాణ పై ప్రభావం ఉండనుంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి : హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం