వరుస సెలవుల ఎఫెక్ట్.. తిరుమలలో శ్రీవారి దర్శనానికి భారీ సమయం

ఆది, సోమవారాలు వరుస సెలవులు కావడంతో తిరుమల తిరుపతికి భక్తులు పోటెత్తారు.

Update: 2024-08-27 02:48 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆది, సోమవారాలు వరుస సెలవులు కావడంతో తిరుమల తిరుపతికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా సోమవారం కృష్ణాష్టమి కావడంతో వేల సంఖ్యలో భక్తులు కాలినడక ద్వార కొండపైకి చేరుకున్నారు. దీంతో తిరుమల ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. మంగళవారం తెల్లవారుజాము సమయానికి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. అలాగే దర్శన టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. కాగా సోమవారం రోజు శ్రీవారిని 76,910 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 30,320 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం 4.26 కోట్లు వచ్చింది.


Similar News