మంత్రి హరీశ్ విమర్శలపై మీ స్పందనేంటి?.. సీఎం జగన్‌ను ప్రశ్నించిన సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ

ఏపీపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన విమర్శలకు సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్రకార్యదర్శికె.రామకృష్ణ డిమాండ్ చేశారు.

Update: 2023-04-18 10:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్రకార్యదర్శికె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఎందుకు ఒత్తిడి పెంచడం లేదని నిలదీశారు. అటు రాజ్యసభలోనూ ఇటు లోక్‌సభలోనూ మెజారిటీ ఎంపీలను కలిగి ఉండి కూడా ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాటం చేయడం లేదని సీపీఐ రామకృష్ణ నిలదీశారు.

విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయకపోయినా.. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి నిధులు విడుదల చేయకపోయినా వైఎస్ జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు.ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాలపై ఎందుకు ఒత్తిడి పెంచడం లేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదు అని కేంద్రం చెప్తున్నా కనీసం జగ్ స్పందించకపోవడం శోచనీయమన్నారు. మరోవైపు తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలతోనైనా సీఎం జగన్‌లో కదలికలు రావాలన్నారు. ఏపీ పాలకులకు చేతనైతే ప్రత్యేక హోదా గురించి పోరాడాలని, విశాఖ ఉక్కు కోసం పోరాడాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తాము నీళ్లు ఇచ్చినట్టు ఇవ్వాలని చేసిన సవాల్ పై ఏం సమాధానం చెప్తారని సీఎ: జగన్‌ను సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ నిలదీశారు.

ఇవి కూడా చదవండి: ‘1953 నుంచి ఇప్పటి వరకు ఇంత దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఎప్పుడూ లేడు’


Similar News