ఏపీని కబలిస్తున్న కరోనా.. భారీగా పెరిగిన మరణాలు

Update: 2022-01-25 13:21 GMT

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాల సైతం పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 46,929 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 13,819 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,08,955 చేరుకుంది. అయితే గత 24 గంటల్లో మహమ్మారి కారణంగా చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించగా, ప్రకాశం మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14561 గా ఉంది. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో 1,01,396 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,22,34,226 సాంపిల్స్‌‌ని పరీక్షించడం జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఒక్కరోజులో 12 మంది వైరస్‌ కారణంగా మరణించడం థర్డ్‌ వేవ్‌లో మెుదటిసారి. దీంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మాస్కులు లేకుండా రహదారులపైకి వచ్చిన వారికి జరిమానా విధించడం తో పాటు, కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.

Tags:    

Similar News