ప్రియురాలితో గెస్ట్‌హౌస్‌లో పోలీస్ రాసలీలు: రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

ప్రజలకు రక్షణ కల్పించే రక్షకభటుడు ఆయన.

Update: 2023-10-19 09:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజలకు రక్షణ కల్పించే రక్షకభటుడు ఆయన. భార్య కుటుంబంతో సంతోషంగా గడపాల్సింది పోయి దారి తప్పాడు. భార్య ఉండగానే మరో మహిళతో సహజీవనం చేయడం మెుదలు పెట్టాడు. ప్రియురాలి మోజులో పడి భార్యను కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన భార్య ఆరా తీసింది. భర్తకు వివాహేతర సంబంధం ఉందని నిర్ధారించారు. అంతే భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి మార్పురాలేదు.అయితే భర్త ప్రియురాలితో గెస్‌ హౌస్‌లో ఉన్న విషయం తెలుసుకున్న భార్య పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో కత్తి శ్రీను అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లై భార్య కూడా ఉంది. అయితే భార్యతో కొన్నాళ్లు సంసారం చేసిన కానిస్టేబుల్ శ్రీను అనంతరం మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలి మోజులోపడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన భార్య ఆరా తీసింది. భర్త ప్రవర్తనలో మార్పు కోసం అతడిని ఫాలో అయ్యింది. ఓ యువతితో వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని గమనించింది. ఈ సందర్భంగా పోలీసులకు పలుమార్లు భర్తపై ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. రెడ్ హ్యాండెడ్‌గా భర్తనుపట్టుకోవాలని భావించింది. ఈ క్రమంలో గెస్ట్‌హౌస్‌లో యువతితో ఉండగా భర్తను పోలీసులకు పట్టించింది. దీంతో కానిస్టేబుల్‌ శ్రీనును పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

Tags:    

Similar News