దమ్ముంటే పులివెందులలో పోటీ చెయ్యండి: చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లకు మాజీమంత్రి వెల్లంపల్లి సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు దమ్ముంటే పులివెందులలో పోటీ చెయ్యాలి అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఛాలెంజ్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు దమ్ముంటే పులివెందులలో పోటీ చెయ్యాలి అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్‌కు సొంత నియోజకవర్గమే లేదు అని ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 4 సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అన్ని శాఖల సమన్వయంతో ఆరోగ్య సురక్ష క్యాంపు చాలా విజయవంతంగా సాగుతుందని చెప్పుకొచ్చారు. ఉదయం నుంచి వందలాది మంది వైద్యం చేయించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఎటువంటి వ్యాధి ఉన్న వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. మెరుగైన వైద్యం అందిస్తున్నామని...ప్రతి రోజు 2 వేల నుండి 3 వేల మంది వరకు వైద్యం చేయించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అందరి సమన్వయంతో క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటి ముంగిట్లోకి వైద్యం తేవడం జరిగిందని వెల్లడించారు. దేశంలో ఎక్కడ లేని కార్యక్రమాన్ని సీఎం ప్రవేశ పెట్టారని...ప్రజలందరికీ మంచి వైద్యం అందించేందుకు ఈ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని వ్యాఖ్యానించారు. ప్రజలంతా దీనిని సద్వినియోగ పరుచుకోవాలని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
నాదెండ్ల మనోహర్ కళ్లు మందగించాయి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నియోజకవర్గమే లేదని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ వీళ్లంతా దేనికి పనికిరాని వ్యక్తులంటూ మండిపడ్డారు.మరోవైపు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కళ్ళు మందగించినట్టు ఉన్నాయని..ప్రజలు అంతా సంతోషంగా ఉంటే ఆయన మాత్రం వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్యుడు మంచిగా ఉంటున్నారు అది పవన్ కల్యాణ్ చూసి ఓర్వలేక పోతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ అధ్వర్యంలో ప్రతి పిల్లోడికి అమ్మఒడి ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. కకుర్తి పడే పద్దతి తమ ప్రభుత్వంకి లేదని చెప్పుకొచక్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన బాగ్యలక్ష్మి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు బండి పుణ్యశీల, యాలకల చలపతిరావు, సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు, నగర పాలక సంస్థ అధికారులు, సచివాలయం సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.