Sajjala Ramakrishna Reddyపై కోర్టు ధిక్కరణ కేసు పెడతాం!
ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై కోర్టు ధిక్కరణ కేసు పెడతామని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. ఆంధ్రా, తెలంగాణ విభజన చట్టంపై కోర్టులో వాదనలు జరుగుతున్న తరుణంలో టీవీల్లో మాట్లాడటం మంచి పద్ధతికాదని సూచించారు..
దిశ (ఉభయ గోదావరి): ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై కోర్టు ధిక్కరణ కేసు పెడతామని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. ఆంధ్రా, తెలంగాణ విభజన చట్టంపై కోర్టులో వాదనలు జరుగుతున్న తరుణంలో టీవీల్లో మాట్లాడటం మంచి పద్ధతికాదని సూచించారు. కోర్టులో ఉన్న అంశంపై మాట్లాడకూడదనే కనీస పరిజ్ఞానం కూడా లేకపోవడం దారుణమని విమర్శించారు. ఇటువంటి వారి వల్లే కోర్టు మీద గౌరవం పోతుందన్నారు.
రెండు రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్రా చాలా అంశాల్లో నష్టపోయిందని హరిరామ జోగయ్య అన్నారు. ప్రజా సంఘాలు చాలా పోరాటాలు చేసినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నాయని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభించనుందనే నమ్మకం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కోర్టులో మధ్యంతర వాదనలు ఉన్న సమయంలో ఇలా విభజన అంశంపై మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారమని చెప్పారు. దీనిపై కేసు పెట్టే ప్రయత్నంలో ఉన్నామని, ఇటువంటి తొందర పాటు స్టేట్‌మెంట్లు కంగారు పడకుండా ఎవరు ఇవ్వరాదని సూచించారు. ఇటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డికి కనీసం ఆ విషయం కూడా తెలియకపోవడం దారుమన్నారు. ఇటువంటి వారు ప్రభుత్వంలో ఉండటం ప్రజలు చేసుకొన్న పాపమని హరిరామ జోగయ్య విమర్శించారు.
READ MORE