అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం:YS Jagan Mohan Reddy (వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి)
భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని..అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని..అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో కలిసి సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి గవర్నర్ బీబీ హరిచందన్, సీఎం వైఎస్ జగన్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగం రూపొందించారని గుర్తు చేశారు. అనేక కులాలు, మతాలతో మిళితమైనది మన దేశం. 72 ఏళ్లుగా ఈ రాజ్యాంగం సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసింది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అణగారిన వర్గాలకు అండగా నిలిచేలా రాజ్యాంగాన్ని రూపొందించిన రూపకర్త అంబేద్కర్‌కు అంజలి ఘటిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో డా.బి.ఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 2023 ఏప్రిల్ 14న బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలు, దళితులకు చేస్తున్న సంక్షేమ పథకాలు, కల్పిస్తున్న అవకాశాలను సీఎం వైఎస్ జగన్ వివరించారు. రాజ్యాంగంలో పొందుపరిచినట్లు గ్రామ స్వరాజ్యానికి వైసీపీ ప్రభుత్వం రూపకల్పన చేసినట్లు తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో మార్పులు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. 'గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తున్న తొలి రాష్ట్రం మన రాష్ట్రమే కావడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.
అలాగే ఎస్సీ, బీసీలకు అత్యధిక అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వమేనని గర్వంగా చెప్పుకుంటున్నట్లు తెలిపారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీలకు 50 శాతం చెల్లిస్తున్నట్లు తెలిపారు. అక్క చెల్లెమ్మల పేర్లతోనే ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. కేబినెట్‌లో70 శాతం బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు, మైనార్టీలే. స్పీకర్‌గా బీసీని, మండలి చైర్మన్‌గా ఎస్సీని, మండలి డిప్యూటీ చైర్మన్‌గా మైనారిటీ వ్యక్తిని నియమించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.
READ MORE