Ap News: శానసమండలిలో గందరగోళం.. టీడీపీ వర్సెస్ వైసీపీ
ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది...
దిశ, వెబ్ డెస్క్: ఏపీ శాసనమండలి(AP Legislative Council)లో గందరగోళం నెలకొంది. డీఎస్సీ(PDF)పై పీడీఎఫ్(DSC) ఎమ్మెల్యే వాయిదా తీర్మానం ఇచ్చారు. సోషల్ మీడియా అరెస్టులపై వైసీపీ తీర్మానం ఇచ్చింది. దీంతో వాయిదా తీర్మానాలను చైర్మన్ తిరస్కరించారు. అయితే వైసీపీ(Ycp) సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోషల్ మీడియా అరెస్టులపై చర్చ చేపట్టాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్సీల డిమాండ్ చేశారు. పోడియంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలను స్పీకర్ సద్దుమనిగించే ప్రయత్నం చేశారు. అయినా సరే వైసీపీ సోషల్ మీడియా పోస్టులపై చర్చించాలని ఎమ్మెల్సీ బొత్స డిమాండ్ చేశారు. దీంతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సమాధానం ఇచ్చారు. కానీ వేరే ఫార్మాట్‌లో రావాలని యనమల సూచించారు. అయినా సరే వైసీపీ సభ్యులు ఆందోళనను కొనసాగిస్తున్నారు.