కాకపుట్టిస్తున్న పొత్తుల రాజకీయాలు.. విజయవాడ పశ్చిమ టిక్కెట్ రేస్
టీడీపీ తో జనసేన పొత్తు కలుపుకున్న విషయం అందరికి సుపరిచితమే.
దిశ వెబ్ డెస్క్: టీడీపీ తో జనసేన పొత్తు కలుపుకున్న విషయం అందరికి సుపరిచితమే. అయితే పార్టీల పొత్తులు కలిసినంత సులువుగా.. పార్టీ సీట్ల మధ్య పొత్తులు ఇంకా కుదరలేదు. సీట్లు నియామకం ఇంకా జరగకపోవడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటుకి ఇరు పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు టీడీపీ నేతలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు తమదేనని భహిరంగగా ప్రకనటనలు చేస్తున్నారు. మరో వైపు జనసేన నేతలు సైతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు తమదేనని బహిరంగంగా పేర్కొంటున్నారు.
ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు కోసం జనసేన, టీడీపీ మధ్య అంతర్గత యుద్ధమే నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు సీటు ఎవరికీ అనే విషయం పై స్పష్టత లేక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. కాగా ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటుకి జనసేన తరుపు నుండి పోతిన మహేష్ బరిలో ఉండగా.. ఆ సీటు తనకే కావాలని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. తనకి ఆ జియోజకవర్గం టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏదేమైనా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు ఇరు పార్టీల మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read More..
Breaking: నమ్మించి గొంతుకోసిన వ్యక్తి జగన్..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు