ఏపీలో కూటమి గెలుపు.. అయినా స్పందించని జూ. NTR

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ గ్రాండ్ విక్టరీ సాధించింది.

Update: 2024-06-05 02:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ గ్రాండ్ విక్టరీ సాధించింది. ప్రత్యర్థి వైసీపీని కేవలం 11 సీట్లకు కూటమి పరిమితం చేసి ఏకంగా 164 స్థానాల్లో గెలుపొందింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఏపీలో కొత్తగా కొలువుదీరే ప్రభుత్వానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు విషెస్ తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, కేటీఆర్ ఇలా చాలా మంది ప్రముఖులు కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే చంద్రబాబు అరెస్ట్‌పై మౌనంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఏపీలో కూటమి గెలుపుపై కూడా స్పందించలేదు. ప్రస్తుతం ఈ అంశం ఏపీ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సైలెంట్ అవుతూ వస్తున్నారు. మరి రానున్న రోజుల్లోనైనా కూటమి సర్కారు విషెస్ చెబుతారా.. చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్న తరుణంలో ఆయనను కలుస్తారా అనేది ఆసక్తిగా మారింది.


Similar News