నామినేటెడ్ పదవుల భర్తీపై కూటమి సర్కారు కీలక నిర్ణయం?

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కార్పొరేషన్ చైర్మన్‌ల నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-07-08 07:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కార్పొరేషన్ చైర్మన్‌ల నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన జీవో ప్రకారం రాష్ట్రంలోని 35 కార్పొరేషన్లకు కొత్త చెర్మైన్లను నియమించారు. ఈ క్రమంలో ఏపీ కూటమి సర్కారు కూడా నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియపై ఫోకస్ చేస్తుంది. మూడు పార్టీలకు పదవుల అంశంపైన తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. ముందుగా రాష్ట్ర స్థాయి పదవులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న డిటైల్స్‌ను అందించాలని సాధారణ పరిపాలన శాఖ రీసెంట్‌గా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వీటితో పాటుగా సొసైటీ, ప్రత్యేక బాడీల్లో ఉన్న పోస్టుల వివరాలు కూడా అందించాలని కోరారు. వివిధ శాఖల్లో దాదాపు 95 కార్పొరేషన్ చెర్మైన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయట. కాగా వీటిలో 25 చెర్మైన్ పోస్టులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారని సమాచారం. అలాగే మాజీ మంత్రులు.. సీనియర్ నాయకులు కూడా నామినేటెడ్ పదవులను దక్కించుకోవడానికి శత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంలో ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. వచ్చిన అప్లికేషన్లను మొదటగా కూటమి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్క్రూటినీ చేస్తారని అంటున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారట. ప్రస్తుతం కూటమిలోని పార్టీలు ఏ పార్టీకి ఎన్ని పోస్టులు ఇవ్వాలి? ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలనే అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఎవరికి ఏ పదవులు దక్కుతాయోనని ఏపీ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.  


Similar News