చేనేత కార్మికుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ లోని చేనేత కార్మికుల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించే పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Update: 2025-03-18 10:31 GMT
చేనేత కార్మికుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం శుభవార్త
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని చేనేత కార్మికుల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించే పథకానికి కూటమి ప్రభుత్వం (Coalition Government) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ (Free Current) అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ జరిగిన మంత్రిమండలి సమావేశంలో (Cabinet Meeting) నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చేనేత కుటుంబాల ఇళ్ల (Handloom Workers) నిర్మాణానికి రూ.50 వేలు అదనంగా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని చేనేత కుటుంబాలు మరికొంత లబ్ధి పొందనున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

దీనిపై ఆయన.. చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. అలాగే దీనివల్ల 93 వేల మంది నేతన్నల గృహాలకు, 10,534 మరమగ్గాలకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. అంతేగాక ఇప్పటికే చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి అదనంగా రూ.50 వేల సహకారం అందజేసేందుకు.. అలాగే చేనేత కార్మికులకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, వీటన్నింటినీ నెరవేర్చడానికి.. చేనేత రంగ అభివృద్ధికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.138.08 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు. ఇక చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని, ఈ సహకారాన్ని అందుకుని నేతన్నలు వృద్ధిలోకి రావాలని టీడీపీ అధినేత కోరారు.

Tags:    

Similar News