రేపు విజయవాడ, నెల్లూరులో సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ, నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైంది.

Update: 2023-05-11 08:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ, నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 12న విజయవాడలో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఉదయం 8.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం చేరుకుంటారు. అక్కడ రేపటి నుంచి ప్రారంభమయ్యే శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లి చేరుకుంటారు.

అనంతరం 9.35 గంటలకు తాడేపల్లి హెలీప్యాడ్‌కు చేరుకుని కావలి బయలుదేరుతారు. 10.30 గంటలకు కావలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంకు చేరుకుంటారు. ఆ తర్వాత కావలి మినిస్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని చుక్కల భూములను 22ఏ నిషేదిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడినుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

గర్భిణులకు, బాలింతలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం!  

Tags:    

Similar News