Breaking: రేపు ఆ రెండు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్.. కారణం ఇదే!
వైసీపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో గేలుపే లక్ష్యంగా అడుగులేస్తున్నారు.
దిశ డైనమిక్ బ్యూరో: వైసీపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో గేలుపే లక్ష్యంగా అడుగులేస్తున్నారు. అటు ప్రభుత్వ కార్యక్రమాలు, ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటుగా ప్రైవేట్ కార్యక్రమాలు కూడ చూసుకుంటూ నిత్యం బిజీగా బిజీగా గడుపుతోన్న వైసీపీ అధినేత అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 15వ తేదీన అంటే రేపు ఉదయం కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహాం జరగనుంది. కాగా ఈ వివాహానికి సీఏం జగన్ హాజరుకానున్నారు. వివాహ వేడుక తిలకించిన తరువాత అంటే రేపు మధ్యాహ్నం తర్వాత గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.
కాగా రెండు జిల్లాల పర్యటన నేపధ్యంలో సీఎం జగన్ రేపు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి మొదటగా కర్నూలు చేరుకుంటారు. అక్కడ బళ్లారి రోడ్‌లోని ఫంక్షన్ హాల్‌లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్నారు. అనంతరం తిరిగి మధ్యాహ్నం తాడేపల్లి చేరుకోనున్నారు. ఆ తరువాత రేపు మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి చేరుకోనున్నారు.
ఇక గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి చేరుకున్న జగన్ అక్కడ వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్నారు. సభ ముగిసిన అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సాయంత్రం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.