చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్రలేస్తుంది.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
ఎన్నికలకు సమయం దగ్గర పడిందని, పేదల వ్యతిరేకులను ఓడించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ....
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలకు సమయం దగ్గర పడిందని, పేదల వ్యతిరేకులను ఓడించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్‌లో ‘మేమంతా సిద్ధం’ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌పై విమర్శలు చేశారు. పెత్తందారులకు చంద్రబాబు, పవన్ అనుకూలమని, తాము మాత్రం పేదల కోసమే ఆలోచిస్తామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు పెత్తందారుల అనుకూల వర్గానికి, పేదల అనుకూల వర్గానికి మధ్య క్లాష్ వార్ జరుగుతోందన్నారు. తాము గెలిస్తే పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. పొరపాటున కూడా చంద్రబాబుకు ఓటు వేయొద్దన్నారు. ఓటు గాని వేస్తే పథకాలు రద్దు చేస్తారని తెలిపారు. చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుందని, పసుపతి నిద్రలేచి వదల బొమ్మాళి అంటారని ఎద్దేవా చేశారు. ప్రజలు వేసే రెండు ఓట్లు కూడా వైసీపీ అభ్యర్థులకే వేయాలని సీఎం కోరారు. ఫ్యాన్‌కు ఓటేస్తే అవ్వాతాతలకు ఇంటి వద్దే రూ. 3 వేలు పింఛన్ అందుతుందని తెలిపారు. చంద్రబాబుకు ఓటు వేస్తే జన్మభూమి కమిటీలు మళ్లీ దోచుకుంటాయన్నారు. వైసీపీకి ఓటు వేస్తే లంచాలు, వివక్షల లేని పారిపాలన చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు వేసే ఓటే వచ్చే ఐదేళ్ల భవిష్యత్తు అని సీఎం జగన్ తెలిపారు.
Read More...
బీఫామ్ ఎవరిదైనా యూనిఫాం చంద్రబాబుదే.. కాకినాడ సభలో సీఎం జగన్ సెటైర్లు