19న బృహత్తర కార్యక్రమం.. అందరికీ ఆహ్వానం

ఈ నెల 19న సీఎం జగన్ మో‌హన్ రెడ్డి విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ...

Update: 2024-01-17 12:49 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 19న సీఎం జగన్ మో‌హన్ రెడ్డి విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు సీఎం జగన్ ఇవాళ ట్విట్టర్ వేదికగా ఓ ఓ వీడియోను పోస్ట్ చేశారు. విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదని, దేశానికే తలమానికమని చెప్పారు. ఇది “స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’’ అని పేర్కొన్నారు. చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తినిస్తుందన్నారు. ఈనెల 19న జరిగే విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని సీఎం జగన్ కోరారు.

కాగా విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వేగంగా ఈ విగ్రహం నిర్మాణం జరిగింది. దీంతో ఈ నెల 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ తర్వాత సమాజిక సమతా సంకల్పం పేరతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు.

Tags:    

Similar News