పెన్షన్ కోసం వెళ్లి 31 మంది వృద్ధులు మృతి.. చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

పెన్షన్ కోసం 31 మంది వృద్ధులు మృతి చెందారని, వారందరినీ చంద్రబాబు చంపారని అని సీఎం జగన్ ప్రశ్నించారు. ...

Update: 2024-04-04 12:30 GMT

దిశ, వెబ్ డెస్క్: పెన్షన్ కోసం 31 మంది వృద్ధులు మృతి చెందారని, వారందరినీ చంద్రబాబు చంపారని అని సీఎం జగన్ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా నాయుడు‌పేటలో మేమంతా బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబు వల్లే రాష్ట్రంలో 31 మంది పెన్షన్ దారులు చనిపోయారని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రతి నెలా 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి పింఛన్ అందించామని చెప్పారు. అది జీర్ణించుకోలేక, ఆసూయతో పింఛన్లను అడ్డుకున్నారని మండిపడ్డారు. పింఛన్లు అందిస్తున్న వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి నమ్మగడ్డ రమేశ్‌తో చంద్రబాబు ఫిర్యాదు చేయించారన్నారు. చంద్రబాబు హయాంలో రూ. 1000 పింఛన్ ఇస్తే.. తాము రూ. 3 వేలు అందించామని తెలిపారు. తాము చెప్పడం వల్లనే పెన్షన్లు ఆగిపోయాయని టీడీపీ అభ్యర్థులు సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. పెన్షన్ కోసం వెళ్లి ఎండ తీవ్రత తట్టుకోలేక 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News