ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై సీఎం జగన్ ఫైర్.. వెంటనే సీఎంవోకు రావాలని కబురు

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ ప్రజల్లో వ్యతిరేక ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే పనిలో బిజీబిజీగా ఉన్నారు.

Update: 2024-01-09 10:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ ప్రజల్లో వ్యతిరేక ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే పనిలో బిజీబిజీగా ఉన్నారు. నియోజకవర్గాల్లో ఇంచార్జీలను మారుస్తున్న తరుణంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే పార్టీ అధినేతపై బాహాటంగా విమర్శలు చేస్తూ.. మీడియా ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా, శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తనకు శింగనమల సీటు ఇవ్వకపోవడం పట్ల ఏకంగా సీఎంవో కార్యాలయంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఫేస్ బుక్ వేదికగా మనసులో ఉన్నవి అన్ని బయటకు చెప్పేశారు.

మా ప్రాంతంలోని కాలువల నుంచి నీటి విడుదల కోసం సీఎంవో నుంచి అనుమతి తీసుకోవాల్సివస్తుందిన నిర్వేదంతో వీడియో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ఆ పరిణామంపై ఆయన వివరణ కోరినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలంటూ పద్మావతికి ఫోన్ వచ్చింది. దీంతో ఇవాళ ఆమె అమరావతికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎం జగన్‌ను కలవబోతున్నారు. 

Tags:    

Similar News