ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయం.. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర

ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు నాలుగో దశలో మే 13 పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార జోరు పెంచాయి.

Update: 2024-03-18 08:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు నాలుగో దశలో మే 13 పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇందులో భాగంగా ఆదివారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చిలకలూరిపేట లో భారీ సభలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ క్రమంలో అధికారంలో ఉన్న జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోసం స్వయంగా రంగంలోకి దిగిన జగన్.. బస్సు యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను తాకుతు ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని.. మేమంతా సిద్ధం పేరుతో ఈ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు మొత్తం 20 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని, 25 సభలలో సీఎం జగన్ పాల్గొంటారని.. వైసీపీ శ్రేణులు ప్రకటించారు. కాగా దీనికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Read More..

ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యం.. నాదెండ్ల మనోహర్ సీరియస్  

Tags:    

Similar News