CM Chandrababu:భారీ వర్షాల ఎఫెక్ట్..సీఎం చంద్రబాబు పర్యటన రద్దు

ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం(panic) సృష్టించాయి.

Update: 2024-09-04 05:34 GMT

దిశ,వెబ్‌డెెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం(panic) సృష్టించాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నిన్న (మంగళవారం) వరద(Floods) ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) జేసీబీలో కూర్చుని లోతట్టు ప్రాంతాల ప్రజలను పరామర్శించారు. జక్కంపూడి, సింగ్ నగర్, సితార సెంటర్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను(difficulties) అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని వారికి హామీ(guarantee) ఇచ్చారు.

ఈ నేపథ్యంలో నేడు(బుధవారం)చేపట్టాల్సిన రేపల్లె(Repalle) పర్యటనను రద్దు చేసుకున్నారు. వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే(Aerial Survey) నిర్వహించాలని భావించినా వాతావరణం(weather) అనుకూలించకపోవడంతో రద్దు చేశారు. ఇవాళ ఉదయం విజయవాడ కలెక్టరేట్‌లో వరద బాధితులకు సహాయ కార్యక్రమాల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాల పై ఆరా తీశారు.


Similar News