CM Chandrababu:పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు కీలక శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు కీలక శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు(బుధవారం) మరో మూడు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లుగా ఈ శాఖలో జరిగిన వ్యవహారాల పై అధికారులతో చర్చించారు. టీడీపీ హయాంలో వచ్చిన పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లారని అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. ప్రభుత్వం సహకరించకపోవడం, వివిధ కారణాలతో వేధింపులకు పాల్పడటంతో భూ కేటాయింపులు జరిగిన తర్వాత కూడా పలు కంపెనీలు వెళ్లిపోయాయన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూములు దుర్వినియోగం అయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పారిశ్రామిక వేత్తల్లో తిరిగి నమ్మకాన్ని కల్పించేందుకు స్వయంగా తాను మాట్లాడుతానని సీఎం చంద్రబాబు తెలిపారు.