AP News:‘బాధితులు సంయమనం వహించాలి’..సీఎం చంద్రబాబు కీలక సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజుల నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-09-03 08:38 GMT

దిశ,వెబ్‌డెస్క్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజుల నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా చాలామంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మరికొంత మంది ప్రాణాలను సైతం కోల్పోయారు. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి.

ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతేకాదు వారికి కీలక సూచనలు చేశారు. విజయవాడలో ప్రతి ఏరియాకు ఆహారం, నీళ్లు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బాధితులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అర్ధగంట ఆలస్యమైందని ఆవేశపడితే అది నాలుగైదు గంటలు అయ్యే అవకాశం ఉందన్నారు. దీనివల్ల వ్యవస్థలు నాశనమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం 3 బాధిత కుటుంబాలను ఏదో ఒక రూపంలో ఆదుకోవాలని పిలుపునిచ్చారు. మానవత్వంతో ముందుకు రావాలని కోరారు.


Similar News