వారికి సొంత ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
ఆర్-5 జోన్ లబ్ధిదారుల అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆర్-5 జోన్ లబ్ధిదారుల అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలోని ఆర్-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు సొంత ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. అవసరమైతే టిడ్కో ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చారు. కాగా, అమరావతిలోని ప్రాంతాలను చంద్రబాబు హయాంలోనే 9 జోన్‌లుగా విభజించారు. నవనగరాలుగా నిర్మించాలని పెట్టుకున్న ప్లాన్‌లో భాగంగా రాజధాని ప్రాంతాన్ని 9 జోన్‌లుగా పేర్కొంటూ.. జీవో కూడా విడుదల చేశారు. వీటిలో ఆర్-5 జోన్ కీలకం. ఇది రాజధాని ప్రాంతంలో 900 ఎకరాల స్థలం. ఇక్కడ పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు హయాంలో నిర్ధారించిన మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్నారు. తద్వారా.. ఈ ప్రాంతం రాజధానికి మరో ఆదాయ వనరుగా మారుతుందని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.