అది తెలుగువారి అదృష్టం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

తిరుమలలాంటి పుణ్యక్షేత్రం మనకు ఉండడం తెలుగువారి అదృష్టమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Update: 2024-09-27 13:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలాంటి పుణ్యక్షేత్రం మనకు ఉండడం తెలుగువారి అదృష్టమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతకు ముందు వెళ్లాను ఇప్పుడెందుకు వెళ్లకూడదని జగన్(Jagan) అంటున్నారు. జగన్‌ అప్పుడు నిబంధనలు ధిక్కరించి తిరుమల వెళ్లారని గుర్తుచేశారు. గతంలో చాలా మంది డిక్లరేషన్‌ ఇచ్చి తిరుమల వెళ్లారు. అన్ని మతాలను గౌరవిస్తానన్న జగన్‌ తిరుమలలో ఎందుకు నిబంధనలు పాటించరు? అని చంద్రబాబు ప్రశ్నించారు. నాలుగు గోడల మధ్యే కాదు బయట కూడా బైబిల్‌ చదువుకోవచ్చని హితవు పలికారు.

‘నేను మసీదుకు వెళ్తాను, చర్చికి వెళ్తాను.. వాళ్ల మతాచారాలను గౌరవిస్తాను. డిక్లరేషన్‌పై ఎందుకు సంతకం పెట్టాలి అన్న రీతిలో జగన్‌ మాట్లాడుతున్నారు’ అని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అంతేకాదు.. నెయ్యి కల్తీనే జరగలేదని అంటాడు.. ఈవో చెప్పారని అంటాడు. NDDB రిపోర్ట్‌నే తప్పుబడుతున్నారు. చెప్పిన అబద్ధాన్నే జగన్‌ మళ్లీ మళ్లీ చెబుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రిపోర్ట్‌ బయటపెట్టకుంటే దాచిపెట్టినట్టు కాదా.? అని అడిగారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే అధికారం మీకెవరిచ్చారని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో తిరుమలలో నాసిరకం భోజనాలు పెట్టారని గుర్తుచేశారు. అన్ని ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి దాపురించిందని చంద్రబాబు అన్నారు.


Similar News