CM Chandrababu:ముస్లిం సోదరులకు సీఎం చంద్రబాబు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Update: 2024-09-16 05:27 GMT

దిశ, డైనమిక్​ బ్యూరో:ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సాటివారి పట్ల ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ భావనలతో ఉన్నప్పుడే ప్రవక్త కోరుకున్న శాంతియుత సమాజం నెలకొంటుంది. ఆ దిశగా మనందరం కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం అయిన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులు మంత్రి నారా లోకేష్​ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సోదరభావం, కరుణ, ధర్మబద్ధ జీవనాన్ని బోధించిన మహమ్మద్ ప్రవక్త పుట్టిన అత్యంత పవిత్రమైన రోజుని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.. అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు


Similar News