రేపు రాత్రి ఢిల్లీకి చేరుకోనున్న సీఎం చంద్రబాబు..కారణం ఏంటంటే?

ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Update: 2024-07-02 14:00 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. హామీల్లో చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అధికారంలోకి రాగానే సీఎం హోదాలో మొదటి సంతకం మెగా డీఎస్సీ పై చేశారు. అదే విధంగా జులై 1వ తేదీన పెన్షన్ పెంచి ఇంటింటికి వచ్చి ఇస్తామని చెప్పారు. నిన్న పెన్షన్ల పంపిణీ పండగ వాతావరణంలా కొనసాగించారు. వలంటీర్ల సహాయం లేకుండానే పింఛన్ పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో రేపు (బుధవారం) పలు కీలక అంశాలపై చర్చల నిమిత్తం సీఎం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఎల్లుండి పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలు సహా పలు అంశాలపై ఆయన వారితో చర్చిస్తారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగే కేటాయింపుల ప్రతిపాదనలపైనా సీఎం మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News