AP:రౌడీయిజం చేస్తే అణచివేస్తాం..సీఎం చంద్రబాబు వార్నింగ్!

ఏపీలో 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది.

Update: 2024-06-20 10:34 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. నేడు (గురువారం) అమరావతిలో సీఎం పర్యటించారు. ఈ క్రమంలో వైసీపీ హయాంలో రాజధాని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో గత ప్రభుత్వం పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్యాయంగా టీడీపీ నేతలను, కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు.  రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ పాలనలో ఐదేళ్లు దౌర్జన్యాలు చేశారని, ఇకపై ఎవ్వరి ఆటలు సాగనివ్వబోమని అన్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకుని రౌడీయిజం చేస్తే నిర్మొహమాటంగా అణిచివేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు సైతం తప్పు చేస్తే ఉపేక్షించబోనన్నారు. ఉన్మాది పాలన నుంచి దేవుడే ప్రజలను కాపాడారని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News