AP News:సతీమణి నారా భువనేశ్వరికి థ్యాంక్స్ చెప్పిన సీఎం చంద్రబాబు

గత నాలుగు రోజుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి.

Update: 2024-09-04 08:28 GMT

దిశ,వెబ్‌డెస్క్:గత నాలుగు రోజుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని బెజవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలను వరద నీరు బీభత్సం సృష్టించింది. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నడుం లోతుకు వరద నీరు రావడంతో జనం భయాందోళనకు గురయ్యారు. వరద బాధితులను సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు సహాయక చర్యల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇక వరద బాధితులకు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు భారీ విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సతీమణీ నారా భువనేశ్వరి రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.2 కోట్లు విరాళం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు రూ.2కోట్లు విరాళం ఇచ్చిన నారా భువనేశ్వరికి సీఎం చంద్రబాబు థాంక్స్ చెప్పారు. వినాశకరమైన వరదల దృష్ట్యా ఏపీ, తెలంగాణ CMRF లకు చెరో రూ.కోటి విరాళమిచ్చిన నారా భువనేశ్వరి నేతృత్వంలోని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నిర్వాహకులకు ధన్యవాదాలు. సహాయం చేయడానికి ముందుకు వచ్చిన అనేక మందికి కృతజ్ఞతలు. ఈ కష్ట సమయాల్లో, ఇలాంటి చర్యలు మానవత్వం పై విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయి అని ట్వీట్ చేశారు.


Similar News