జలదిగ్బంధంలో 2.76 లక్షల మంది.. మరోసారి ఆ ప్రాంతానికి సీఎం చంద్రబాబు

విజయవాడలోని సింగ్‌నగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోసారి పర్యటించారు. భారీ వరదలు జనజీవనాన్ని చిన్నాభిన్నం చేయడంతో సోమవారం సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Update: 2024-09-02 13:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని సింగ్‌నగర్ ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోసారి పర్యటించారు. భారీ వరదలు జనజీవనాన్ని చిన్నాభిన్నం చేయడంతో సోమవారం సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యటన పరిస్థితిని గమనించారు. దాదాపు 2.76 లక్షల మంది జలదిగ్బంధంలో ఉన్నారని.. సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. కాగా, ఆదివారం అర్ధరాత్రి అధికారులతో కలిసి సింగ్‌నగర్ ప్రాంతాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలనే రాత్రి అని కూడా లెక్కచేయకుండా సింగ్‌నగర్ వెళ్ళానని స్వయంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు.

సమయం కొంచెం ముందు వెనుక అయినా ప్రతీ ఒక్కరినీ రక్షించి తీరుతామని సీఎం భరోసా ఇచ్చారు. తక్షణమే అధికారులతో మాట్లాడి సోమవారం ఉదయం నుంచి బోట్లు, హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. ఎవరూ అధైర్య పడొద్దని... అండగా ఉంటానని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. పరిస్థితులు చక్కదిద్దే వరకు బాధితుల మధ్యనే ఉంటానని ఆయన ప్రకటించారు.


Similar News