CM Chandrababu: వరద బాధితులకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్

నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. వర్షాల ధాటికి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వాగులు, వంకలు

Update: 2024-07-26 10:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. వర్షాల ధాటికి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వర్షాలతో పాటు ఎగువ నుండి వచ్చిన వరదల వల్ల ఏపీలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయింది. వరద వల్ల లోతట్టు ప్రాంతాల్లోని ఎన్నో వేల కుటుంబాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో వరదల వల్ల నష్టపోయి బాధపడుతోన్న బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ఊరట కలిగించే శుభవార్త చెప్పారు.

వరద బాధిత కుటుంబాలకు రూ.3 వేలు తక్షణ సాయం అందిస్తామని ప్రకటించారు. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల ఎక్కువ నష్టం జరిగిందని అభిప్రాయం వ్యక్తం చేసిన సీఎం.. వర్షాల వల్ల నష్టపోయిన పంటల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. జిల్లా ఇంచార్జ్ మంత్రులు వెంటనే బాధితులను పరామర్శించాలని సూచించారు.  


Similar News