AP:బడ్జెట్ నిధులతో ఎంతో ఊరట..హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
లోక్‌సభలో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పందించారు.
దిశ,వెబ్‌డెస్క్: లోక్‌సభలో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అవసరాలు గుర్తించి బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు పీఎం మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్థికంగా కూరుకుపోయిన రాష్ట్రానికి బడ్జెట్ నిధులు ఎంతో ఊరటనిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక రంగం, ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం హర్షణీయం అని పేర్కొన్నారు. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం పూచీకత్తుతో ఇస్తుంది. అప్పు రూపంలో అయినా 30 ఏళ్ల తర్వాతే తీర్చేది. మరికొంత కేంద్ర గ్రాంట్స్ క్యాపిటల్ అసిస్టెన్స్ రూపంలో వస్తుందన్నారు. పోలవరానికి నిధులు ఎంత అని చెప్పలేదు. దాన్ని పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందని సీఎం తెలిపారు.