నామినేటెడ్ పోస్టులకు పెరిగిన తాకిడి.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే..!

నామినేటెడ్ పోస్టులపై అమరావతి పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు చర్చించారు..

Update: 2024-12-04 11:47 GMT

దిశ, వెబ్ డెస్క్: నామినేటెడ్ పోస్టుల(Nominated posts)పై అమరావతి(Amaravati) టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు(CM Chandrababu) చర్చించారు. ఈ సమావేశంలో ఆశావహులకు ఆయన పలు సూచనలు చేశారు. నామినేషన్ పోస్టులను పార్టీకి చెందిన దాదాపు 70 శాతం మంది కోరుతున్నందున ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికి గుర్తింపు ఇస్తామని తెలిపారు. సేవ చేయడానికి మాత్రమే పార్టీ పదవులు ఇస్తామన్నారు. ప్రజలకు మంచి చేసేలా కార్యచరణ రూపొందిస్తామన్నారు. మంచి పనులతో పార్టీకి మైలెజ్ పెరగాలని సూచించారు. ప్రజలకు పార్టీకి వారధిగా ఉండాలని ఆశావహులకు సూచించారు. నామినేటెడ్ పదవుల్లో సమన్యాయం జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. అటు కూటమి పార్టీల నేతలకు సంబంధించిన పోస్టులపైనా ఆయన స్పందించారు. బీజేపీ (Bjp), జనసేన(Janasena) పార్టీ నేతలకు సైతం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సరైన సమయంలో సరైన పదవులు ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 

Tags:    

Similar News