CM Chandrababu : వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని మరోసారి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు చేశారు.

Update: 2024-09-04 07:40 GMT

దిశ, వెబ్‌‌డెస్: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధికారులకు కీలక ఆదేశాలు చేశారు. ఇవాళ ఉదయం విజయవాడ కలెక్టరేట్‌లో (Vijayawada Collectorate) వరద బాధితులకు సహాయక చర్యలపై ఆయన కలెక్టర్లు, మంత్రులతో టెలి కాన్ఫరెన్స్ (Tele conference) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద ప్రభావం ఎక్కవగా ఉన్న విజయవాడ పట్టణాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అధికారులు, పోలీసులు సమన్వయంతో వరదల్లో మృతి చెందిన వారిని గుర్తించాలని అన్నారు. గుర్తించి మృతదేహాలను గుర్తించి వారి సంబంధీకులకు అప్పగించాలని అన్నారు.

ఎవరూ రాని పక్షంలో ప్రభుత్వం తరపున అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల (Compensation) అందజేయాలని తెలిపారు. వరదల్లో చిక్కుకుపోయిన కుటుంబాల ఆకలి తీర్చేందుకు ఇంటింటకీ వెళ్లి ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా అధికారులు చూడాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేయాలని అన్నారు. బ్లాక్‌ మార్కెటింగ్‌కు అస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి వివరించి సాయం కోరుదామని చంద్రబాబు అన్నారు. అదేవిధంగా వర్షం కారణంగా నిలిచిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.  


Similar News