AP News:సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..పవన్ కళ్యాణ్‌కు మరో కీలక బాధ్యత

ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది.

Update: 2024-08-05 11:38 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రాష్ట్ర సచివాలయంలో నేడు(సోమవారం) జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మొక్కలు నాటే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..ఏపీలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఒకేసారి 5 నుంచి 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలు వ్యవసాయ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు సీఎంకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎం చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇచ్చారు.

Tags:    

Similar News