చంద్రబాబు ఆస్తుల జప్తుకు.. అనుమతి కోరిన సీఐడీ

చంద్రబాబు ఉండవల్లి నివాసం జప్తులో సీఐడీ మరో ముందడుగు వేసింది.

Update: 2023-05-31 04:22 GMT

దిశ,వెబ్‌డెస్క్: చంద్రబాబు ఉండవల్లి నివాసం జప్తులో సీఐడీ మరో ముందడుగు వేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ మార్పుకు సంబంధించిన అవినీతి వ్యవహారంలో చంద్రబాబు నివాసం, మాజీ మంత్రి నారాయణతోపాటు ఆయన సంబంధీకుల ఆస్తులపై సీఐడీ నివేదిక ప్రకారం అటాచ్ మెంట్‌కు హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో సీఐడీ న్యాయపరమైన అనుమతి కోరడంతో నేడు అవినీతి నిరోధక శాఖ కోర్టు విచారణ చేయనుంది. ఈ విచారణతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

అమరావతి నగర ప్రణాళిక .. రింగ్ రోడ్డు వ్యవహారంలో అవినీతి చోటు చేసుకుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్‌కే ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అనేక కోణాల్లో ఇప్పటికే విచారణ చేపట్టింది. గతేడాది మే నెలలో ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు అనుకూలంగా నాటి ప్రభుత్వం క్విడ్ ప్రో కోకు పాల్పడిందని అభియోగాలు నమోదయ్యాయి. లింగమనేని రమేష్‌కు లబ్ధి చేకూర్చేలా రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగాయని నిర్ధారణకు వచ్చింది. అయితే లింగమనేని ఇంటిని అమ్మకుండా నిరోధించేందుకు క్రిమినల్ అమెండ్‌మెండ్ ఆర్డినెన్స్ 1944 కింద జప్తు చేసేందుకు, తదుపరి చర్యల కోసం సీఐడీ అనుమతి కోరింది.

Tags:    

Similar News