VijayaSai Reddy : మరోసారి విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

వైసీపీ కీలక మాజీ నేత విజయసాయిరెడ్డి(VijayaSai Reddy)కి పోలీసులు మరోసారి నోటీసులు(CID Notices) జారీ చేశారు.

Update: 2025-03-18 10:18 GMT
VijayaSai Reddy : మరోసారి విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ కీలక మాజీ నేత విజయసాయిరెడ్డి(VijayaSai Reddy)కి పోలీసులు మరోసారి నోటీసులు(CID Notices) జారీ చేశారు. ఏపీలోని కాకినాడ సీ పోర్ట్ షేర్ల వ్యవహారంలో(Sea Port Shares Issue) సీఐడీ పోలీసులు విజయసాయిరెడ్డికి నోటీసులు అందించారు. ఈ షేర్ల అవకతవకలపై విచారణ కోసం ఈ నెల 25న మరోసారి తమ ఎదుట హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఈనెల 12న ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ దర్యాప్తులో మరింత సమాచారం కోసం మరోసారి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. కాగా ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని. రాజకీయ కక్ష్యతోనే ఇదంతా చేస్తున్నారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణ మురళి ఒకరోజు సీఐడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆయనను నేడు కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. అయితే పోసానిని మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

Tags:    

Similar News