డిప్యూటీ CM పవన్ కల్యాణ్ ఆఫీసులో CI ఓవరాక్షన్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరి ఆఫీసులో సీఐ శ్రీనివాసరావు ఓవరాక్షన్ చేశారు.

Update: 2024-06-27 03:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరి ఆఫీసులో సీఐ శ్రీనివాసరావు ఓవరాక్షన్ చేశారు. పవన్ కల్యాణ్ ఆఫీసులో ఉన్న సమయంలో పర్మిషన్ లేకుండా లోనికి వెళ్లేందుకు యత్నించారు. కాసేపు ఆగాలని పవన్ వారాహి దీక్ష చేపేట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నారని సిబ్బంది సీఐకి తెలిపారు. అయినా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఐ పవన్ కార్యాలయంలోకి వెళ్లినట్లు తెలిసింది. అయితే తాజాగా ఘటనపై పవన్ కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సీఐ శ్రీనివాసరావుపై బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో త్రిపురాంతకం నుంచి సీఐ వినోద్ కుమార్ ను నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వేశ్రేష్ట త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. అయితే సీఐ ప్రవర్తన ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.   


Similar News