మహిళలను కించపరిచే టీడీపీ, జనసేనలను తరిమికొట్టండి:మంత్రి రోజా

రాష్ట్రంలోని మహిళలను హేళనగా, చులకనగా, అసభ్యకరంగా చూస్తూ వారి చావుకు కారణం అవుతున్న టీడీపీ, జనసేనలను వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు.

Update: 2024-03-12 08:30 GMT

దిశ, తిరుమల:రాష్ట్రంలోని మహిళలను హేళనగా, చులకనగా, అసభ్యకరంగా చూస్తూ వారి చావుకు కారణం అవుతున్న టీడీపీ, జనసేనలను వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు.తిరుమలలో ఏపీ టూరిజం కు సంబంధించి అన్నమయ్య, బాలాజీ, నారాయణగిరి రెస్టారెంట్లను ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ తిరుమల కొచ్చే భక్తులకు మంచి క్వాలిటీ, క్వాంటిటీ అందించే లక్ష్యంతో మూడు కొత్త రెస్టారెంట్లను అందుబాటులోకి తేవడం గర్వకారణంగా ఉందన్నారు. టీటీడీ నిర్ణయించిన ధరల ప్రకారం స్టార్ హోటల్ తరహాలో నాణ్యమైన భోజనాన్ని భక్తులు అందించేలా జరుగుతుందన్నారు.

ఇంటి పట్టా వచ్చిందని మీడియాకు చెప్పడమే ఆమె చేసిన నేరమా..

ప్రతి మహిళ బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి చనిపోవడం చాలా బాధ వేసిందన్నారు. కేవలం తన కొచ్చిన ఇంటి పట్టాను సంతోషంగా మీడియాకు చూపించి, మాట్లాడడమే ఆమె చేసిన తప్ప అని అన్నారు.టీడీపీ, జనసేన రెండు ఆ మహిళపై అసభ్యకరంగా మెసేజ్ లు పెడుతూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఎంతో వేధించారని తెలిపారు.మహిళలను గౌరవించే ఈ పుణ్య దేశంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం అన్నారు. ఎవరైతే ఇలాంటి ఘటనలకు పాల్పడి ఆ మహిళ చావుకు కారణమయ్యారో, వాళ్లందరికీ తగ్గిన శిక్ష పడేలా భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. గీతాంజలి మరణం తో ఇద్దరు బిడ్డలు తల్లిలేని అనాధలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గీతాంజలి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను అన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని టీడీపీ, జనసేనలు వారి హద్దుల్లో వారు ఉంటే మంచిదని హితవు పలికారు. మహిళలు అంటే చులకనగా మాట్లాడడం అసభ్యకరంగా మెసేజ్ లు పెట్టడం ఆఖరికి మహిళల ప్రాణాలు తీసే స్థాయికి దిగజారడం దురదృష్టకరం అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోనే మహిళలు అందరూ ఒక తాటిపై రావాలని ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా వాళ్లను గట్టిగా నిలదీయాలని అన్నారు.

లోకేష్ వార్డు నెంబర్ గా కూడా గెలవలేడు..

నారా లోకేష్ ఎమ్మెల్యేగా కాదు కదా వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేడు అన్నారు. అతను చెప్పే మాటలు కూడా ఎవరైనా సమాధానం ఇస్తారా అంటూ వ్యంగంగా అన్నారు. వాళ్లకు జగనన్నతో పోటీపడే దమ్ము ధైర్యం లేదని అర్థం అయిపోయిందన్నారు. ఎన్నికల్లో గెలవలేము అన్న భయం పట్టుకుంది. కాబట్టి ఎవరు దొరికితే వారితో పొత్తులు పెట్టుకుని సీట్లు పంచుకునే స్థాయికి దిగజారి పోయారని ఎద్దేవ చేశారు. ఈ రాష్ట్రంలో జగనన్న ఒక దమ్మున్న నాయకుడని, ప్రజలకు మంచి చేసే నాయకుడని కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో ప్రజల మద్దతుతో జగనన్న రెండోసారి కూడా సీఎం కాబోతున్నారని జోష్యం చెప్పారు. జగనన్న మళ్లీ సీఎం అయితే ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ప్రజలకు మరింత గొప్పగా సంక్షేమ ఫలాలు అందిస్తారని ఆమె తెలిపారు.


Similar News