తిరుపతి జిల్లాలో విషాదం: కాలువలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

ఇద్దరు చిన్నారులు కాలువలో పడి చనిపోయిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది..

Update: 2024-11-16 16:20 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇద్దరు చిన్నారులు కాలువలో పడి చనిపోయిన ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. చిల్లకూరు మండలం అల్లిపురం గిరిజన కాలనీకి చెందిన నాగేంద్రమ్మ(11), చింతాలయ్య(10) బట్టలు ఉతికేందుకు కాలువ వద్దకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు కాలువలో పడిపోయారు. కాలువలో లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. స్థానికులు కాపాడేలోపే నాగేంద్రమ్మ, చింతాలయ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అల్లిపురంలో విషాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News