Tirumala:తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు.

Update: 2024-11-16 03:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో నేడు(శనివారం) తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. ఇక నిన్న( శుక్రవారం) 61,613 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,291 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం (Hundi Income) రూ.3.12 కోట్లు వచ్చిందన్నారు.


Similar News