మేం రెడీ.. మీరు సిద్ధమా?.. Pawanకు మంత్రి Roja సవాల్

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందుకు వైసీపీ సిద్ధమని మంత్రి రోజా తెలిపారు. సీఎం జగన్ ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారని.. తమరు సిద్ధమా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి ఆర్‌కే రోజా సవాల్ విసిరారు..

Update: 2022-12-10 11:22 GMT
మేం రెడీ.. మీరు సిద్ధమా?.. Pawanకు మంత్రి Roja సవాల్
  • whatsapp icon

దిశ వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందుకు వైసీపీ సిద్ధమని మంత్రి రోజా తెలిపారు. సీఎం జగన్ ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారని.. తమరు సిద్ధమా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి ఆర్‌కే రోజా సవాల్ విసిరారు.175 నియోజకవర్గాల్లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే జనసేన తరఫున 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని సవాల్ విసిరారు. ఎవరో సైన్యంలో దూరి దొంగ దెబ్బ తీయాలంటే రాష్ట్రంలో భయపడేవారెవరు లేరని మంత్రి రోజా తెలిపారు. వారాహి వెహికల్ ఫోటోను పోస్ట్ చేసింది పవన్ కల్యాణ్ అని దానిపై చర్చ జరిగింది మీడియాలో తప్ప ఇంకెక్కడ జరగలేదన్నారు. వారాహి వాహనానికి ఆలివ్ గ్రీన్ వేయకూడదని మాజీమంత్రి పేర్ని నాని చెప్తే తప్పేముందన్నారు. శ్వాస అయినా తీసుకోమంటారా అంటూ పవన్ చేసిన ట్వీట్‌కు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. మూడున్నరేళ్లు శ్వాస తీసుకోకుండా బతుకున్నాడా పీకే అని నిలదీశారు. అయినా పవన్ కల్యాణ్ బతుకుతుంది హైదరాబాద్‌లోనని శ్వాస తీసుకోవచ్చా లేదా అనేది అడగాల్సింది కేసీఆర్, కేటీఆర్‌ను అడగాలని రోజా ఎద్దేవా చేశారు. 

Read more:

హైదరాబాద్ తరిమేస్తాం..Pawanపై Roja తీవ్ర ఆగ్రహం

Tags:    

Similar News