వరద విలయం.. చంటిబిడ్డను ఏం చేశారో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

గత మూడురోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఏపీని అతలాకుతలం చేసింది.

Update: 2024-09-03 14:39 GMT

దిశ, వెబ్ డెస్క్ : గత మూడురోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఏపీని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా విజయవాడ నగరం వరద గుప్పిట్లో చిక్కుకుంది. ముంపు ప్రాంతాల్లోని బాధితుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇక నగరంలోని సింగ్ నగర్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ ఇళ్ళల్లోకి నిలువెత్తు వరద పోటెత్తడంతో అక్కడి నుండి బయట పడటానికి చాలామంది బోట్లను ఆశ్రయించాల్సి వచ్చింది. వందలాది మంది ప్రజలు ఆ నీటి నుండి జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. అయితే వీరిలో ఒక కుటుంబం తమ చిన్నారిని ఎలా ఆ వరద నుండి బయటికి తీసుకు వెళ్లాలో తెలియక.. చివరికి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి, దానిని ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఉంచి బయటికి తీసుకు వచ్చారు. మనిషి లోతు నీళ్ళల్లో ప్రాణాలకు తెగించి ఓ ఇద్దరూ యువకులు ఆ చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకు వచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. చాలామంది ఆ యువకులను ప్రశంసిస్తున్నారు.  


Similar News