డిజాస్టర్​ మేనేజ్మెంట్​ కార్యాలయానికి సీఎం..మొక్కుబడి లెక్కలు చెప్పొద్దని అధికారులకు హెచ్చరిక

అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు కురవడం పై ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్నటి నుంచి వరుస సమీక్షలు చేస్తున్న చంద్రబాబు వర్షం కాస్త తగ్గడంతో నేరుగా రంగంలోకి దిగారు.

Update: 2024-09-01 10:00 GMT

దిశ, డైనమిక్​ బ్యూరో:అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు కురవడం పై ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్నటి నుంచి వరుస సమీక్షలు చేస్తున్న చంద్రబాబు వర్షం కాస్త తగ్గడంతో నేరుగా రంగంలోకి దిగారు. విజయవాడ గవర్నర్​పేటలోని డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ కార్యాలయానికి చేరుకుని వరదలు, వర్షాల గురించి ఆరా తీశారు. జియాలజిస్టులు ఆయన మాట్లాడారు. వరద ఉధృతి ఎక్కడెక్కడ ఉన్నది అనే విషయాలపై ఆరా తీశారు.

అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు కురవడం పై ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. నిన్నటి నుంచి వరుస సమీక్షలు చేస్తున్న చంద్రబాబు వర్షం కాస్త తగ్గడంతో నేరుగా రంగంలోకి దిగారు. అనంతరం ఆయన హోంమంత్రి, సీఎస్​, ఉన్నతాధికారులతో వర్షాలు, వరదల పై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావం, వర్షపాతం నమోదు అంశాలు అధికారులు వివరించారు. వరద ప్రవాహం వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. తాజా వర్షాలు ఓ పాఠంగా అధికారులు అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. లెక్కలతో మొక్కుబడి వివరాలు తనకు చెప్పవద్దని హెచ్చరించారు. సాంకేతికతో కూడిన సమగ్ర అధ్యయనం చేసి వివరాలు తనకు అందించాలని సూచించారు. తుంగభద్ర, సుంకేసుల, శ్రీశైలం, సాగర్​, ప్రకాశం, పులిచింతల బ్యారేజీ నీటి నిల్వలపై అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగు ప్రాంతాల్లో తీసుకున్న చర్యల గురించి అడిగారు.


Similar News