తలసరి ఆదాయంలో తెలంగాణా టాప్.. గతంలో మేం చూపిన చొరవ వల్లే.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు
దేశంలో అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని.. గతంలో తాను చూపించిన చొరవ వల్లే తెలంగాణ ఈ పరిస్థితిలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో: అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని.. గతంలో తాను చూపించిన చొరవ వల్లే తెలంగాణ ఈ పరిస్థితిలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజన్ 2047 డాక్యుమెంట్పై అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో తాను చూపించిన విజన్వల్లే తెలంగాణ ఈ పరిస్థితిలో ఉందన్నారు. వికసిత్భారత్2047 కల్లా దేశం 30 ట్రిలియన్డాలర్ల జీడీపీకి చేరాలన్నారు. తలసరి ఆదాయం 18 వేల డాలర్లు ఉండాలన్నారు. నియోజకవర్గ విజన్డాక్యుమెంట్ను అమలుపరిచే బాధ్యత ఎమ్మెల్యేలదేనన్నారు. ఎమ్మెల్యేలకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55 లక్షలు ఉండాలన్నారు. ఆ సమయానికి 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు ఏపీ చేరాలన్నారు.