కేబినెట్‌లోకి నాగబాబు.. సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ప్రత్యేక భేటీ
జనసేన పార్టీ నేత నాగబాబును రాష్ట్ర కేబినెట్‌లోకి తీసునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ నేత నాగబాబు(Nagababu)ను రాష్ట్ర కేబినెట్(Cabinet)లోకి తీసునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)ను జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నాగబాబును కేబినెట్‌లోకి తీసుకునే అంశంపై చర్చిస్తున్నారు. ఇప్పటికే జనసేన(Janasena) నుంచి పవన్ కల్యాణ్‌తో పాటు మరో ఇద్దరు మంత్రులుగా కొనసాగుతున్నారు.ఈ నేపథ్యంలో నాగబాబుకు ఏ శాఖ ఇవ్వాలనే దానిపై వీరిద్దరు సమాలోచనలు చేస్తున్నారు. మంత్రి వర్గంలో మార్పులు చేసి నాగబాబుకు కేబినెట్ బెర్త్ ఖరారు చేస్తారని సమాచారం. ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారని కూటమి నాయకులు అంటున్నారు.
కాగా ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీగా నాగబాబును ఇప్పటికే ఏకగ్రీవం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. మరి ఏం నిర్ణయం తీసుకున్నారో చూడాల్సి ఉంది.