బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో ఒంటిపూట బడుల సమయంలో మార్పులు
రాష్ట్రంలోని విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులకు ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు (half-day school) ప్రారంభం అయ్యాయి.
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులకు ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. వేసవి ప్రారంభం అవ్యడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు (half-day school) ప్రారంభం అయ్యాయి. కాగా ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతుండటంతో ఒక్కపూట బడుల సమయ వేళల్లో మార్పులు చేయాలని మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడులు (half-day school) మధ్యాహ్నం 1. 30 లకు ప్రారంభించాలని మంత్రి తన ఆదేశాల్లో తెలిపారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9. 30 నుంచి మధ్యాహ్నం 12. 45 వరకు జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలో ఒంటిపూట బడులు మధ్యాహ్నం 1.15కు ప్రారంభం అవుతున్నాయి.
అయితే 1.15 కు స్కూల్ ప్రారంభం కానుండటంతో తొందరగా వచ్చిన విద్యార్థులు.. టెన్త్ పరీక్షా పత్రాలు (Tenth exam papers) వెళ్ళేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి చూడాల్సిన పరిస్థితులు రావడంతో.. ఒంటిపూట బడులు సమయంలో మార్పులు చేయాల్సిందిగా మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. తాజా నిర్ణయంతో టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో (School with ten exam centers) మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగునున్నాయి. అయితే మంత్రి ఉత్తర్వులతో మారిన ఈ సమయవేళను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు తమ పిల్లలను.. మధ్యాహ్నం 1.30 వరకు స్కూల్లకు పంపించాలని అధికారులు సూచిస్తున్నారు.