చంద్రబాబు కంటి ఆపరేషన్ పూర్తి.. డిశ్చార్జ్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తైంది.

Update: 2023-11-07 07:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తైంది. గత కొన్ని రోజులుగా కుడికంటి సమస్యలతో చంద్రబాబు నాయుడు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు నాయుడు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు మంగళవారం కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం చంద్రబాబు నాయుడు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఎల్వీ ప్రసాద్ వైద్యులు చంద్రబాబు కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించారు. 2 గంటలపాటు శ్రమించిన వైద్యులు చంద్రబాబు కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడుని డిశ్చార్జ్ చేశారు. శస్త్ర చికిత్స ముగిసిన వెంటనే చంద్రబాబు జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇక జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ ఆభిమానులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చేరుకున్నారు. చంద్రబాబు కుడి కంటి ఆపరేషన్ విజయవంతం అయినట్లు తెలిసిన తర్వాత వారంతా హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News