చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లు ఊడిపోయిన బకెట్ గాళ్లు: కొడాలి నాని

యువగళం నవశకం బహిరంగ సభపై మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-12-21 10:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: యువగళం నవశకం బహిరంగ సభపై మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నవశకం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, నారా లోకేశ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుల వ్యవహారం చూస్తుంటే అడుగు ఊడిపోయిన బకెట్ గాళ్ళంత నిన్న చేసింది..పిల్లి మెడలో గంట కట్టే ప్రయత్నమేనని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ 2009 సెప్టెంబర్ 2నే యుద్ధం మొదలుపెట్టారు అని చెప్పుకొచ్చారు. 12 ఏళ్ల క్రితం యుద్ధభేరి మోగించిన సీఎం జగన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూకటి వేళ్లతో పేకలించారని అన్నారు. అంతేకాదు చంద్రబాబును భూస్థాపితం చేశారని..పవన్ కల్యాణ్‌ను రెండు చోట్ల చిత్తు చిత్తు చేస్తూ మంగళగిరిలో లోకేశ్‌కు సమాధి కట్టాడు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్., లోకేశ్, చంద్రబాబు నాయుడులు గంటల మోగిస్తూ యుద్ధభేరి మొదలెట్టారని ఏం చేసినా జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరు అని మాజీమంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు.

జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరు

ఎమ్మెల్యేలకు ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నాడు అని కొడాలి నాని మండిపడ్డారు. 30ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుండి కుప్పం ట్రాన్స్ ఫర్ కాలేదా అని నిలదీశారు.లోకేశ్ పుట్టింది మంగళగిరిలోనా.... పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకలో గోలీలు ఆడుకున్నాడా అని నిలదీశారు. తండ్రి, కొడుకు ,పార్ట్నర్ ముగ్గురు వలస వెళ్లిన వాళ్లేనని చెప్పుకొచ్చారు. బోరా గాళ్ళంత మొదలెట్టిన యుద్ధభేరితో సీఎం జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరు అని మాజీమంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News